విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం: క్షణాల్లో నరకంగా మారిన ప్లాంట్.. 8 మంది కార్మికుల మృతి!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ SMS-2 యూనిట్‌లో జరిగిన ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందారు…
విశాఖపట్నం (ఉక్కు నగరం): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైన విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakhapatnam Steel Plant) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం ప్లాంట్ పరిధిలోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (SMS-2) విభాగంలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనా స్థలంలో మంటలు భారీగా చెలరేగడంతో ఉక్కు నగరం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఎలా జరిగింది?
పరిశ్రమ వర్గాల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం వేళ కార్మికులు ఎస్ఎంఎస్-2 విభాగంలోని ఎస్టీసీ-3 హీట్ ఎఫ్‌జీలో తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడితో ప్రవహిస్తున్న లిక్విడ్ మెటల్‌ను ల్యాడిల్ ద్వారా లిఫ్ట్ చేసే ప్రక్రియ సాగుతోంది. అయితే దురదృష్టవశాత్తూ మెటల్ లిక్విడ్ లాడిల్ ఒక్కసారిగా పేలిపోవడంతో, అందులోని ద్రవరూప ఉక్కు ద్రవం అకస్మాత్తుగా కిందపడిపోయింది.ఆ వేడి లోహ ద్రవం కింద పనిచేస్తున్న కార్మికులపై పడటంతో పాటు ప్లాంట్ లోపల ఉక్కుద్రవం లీకై భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ల్యాడిల్ నుంచి బకెట్లు కుప్పకూలడం వల్లనే ఈ పెను ప్రమాదం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మృతుల వివరాలు (Victims Information)
మరణించిన వారిలో ప్రముఖంగా:అప్పారావు, ప్రభాకరరావు, కృష్ణ ,రమణ ,త్రినాథ్ అప్పలరాజు ,కుమార్
మిగిలిన ఇద్దరు కార్మికులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది. గాయపడిన మరో ఏడుగురు కార్మికులను ప్లాంట్ యాజమాన్యం తక్షణమే సమీపంలోని అస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తోంది.
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది

ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ లోపల భారీగా పొగ, మంటలు వ్యాపించడంతో ఉక్కు కార్మికులు, ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Brigade) తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్లాంట్ యాజమాన్యం కూడా అత్యవసర భద్రతా చర్యలు చేపట్టింది. ల్యాడెల్‌లోని ద్రవ లోహం ఎందుకు పేలింది, సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఉన్నతాధికారులు లోతైన విచారణ ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం (PM Modi Statement)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) కింద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున తక్షణ పరిహారం అందిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి (CM Chandrababu Naidu)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రమాదంపై తీవ్రంగా స్పందించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని విశాఖపట్నం జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు.
స్పందించిన కేంద్రమంత్రులు కుమారస్వామి, కిషన్ రెడ్డి
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై అధికారులతో మాట్లాడానని, అక్కడి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తామని ట్వీట్ చేశారు.మరోవైపు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి సైతం ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
Ohhగతంలోనూ పలుమార్లు ప్రమాదాలు
విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా స్టీల్ మెల్టింగ్ మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా హైడ్రాలిక్ ఆయిల్ లీకై భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఈసారి ఏకంగా 1500 డిగ్రీల వేడి లోహ ద్రవం పేలడంతో ఇంతటి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనతో ఉక్కునగరంలో ప్రస్తుతం తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం:భద్రతా చర్యలపై ప్రశ్నలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం అనంతరం భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టీల్ మెల్టింగ్ యూనిట్లలో పనిచేసే కార్మికులకు సరైన రక్షణ పరికరాలు అందించారా లేదా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.
దర్యాప్తు కొనసాగుతోంది
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల అమలు, యంత్రాల నిర్వహణ అంశాలను నిపుణుల బృందం పరిశీలిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైతే కొత్త భద్రతా మార్గదర్శకాలు అమలు చేస్తామని వెల్లడించారు.
కార్మిక సంఘాల ఆందోళన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం తర్వాత కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ముఖ్యంగా స్టీల్ మెల్టింగ్ యూనిట్లలో పనిచేసే సిబ్బందికి ఆధునిక భద్రతా పరికరాలు అందించాలని కోరాయి. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం, కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
