BlogTrending

జాబ్ వీసాల పేరుతో భారీ మోసం: ఒక్కొక్కరి నుండి రూ. 20 లక్షల చొప్పున 50 మందిని ముంచేసిన కిలాడీలు!

ఇండియాలో ఉంటూ విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే అమాయకులను టార్గెట్ చేస్తూ ఒక భారీ వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగ సంబంధిత వీసాలు (Job Related Visas) ఇప్పిస్తామంటూ నమ్మబలికి కొందరు కేటుగాళ్లు లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు.నమ్మశక్యం కాని రీతిలో కేవలం ఒక్కొక్కరి దగ్గర నుండే ఏకంగా రూ. 20 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఇలా దాదాపు 50 మంది బాధితుల నుండి కోట్లాది రూపాయలు గుంజి బోర్డు తిప్పేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.బాధితులు తమకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించగా, ఈ భారీ స్కామ్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చే ఇలాంటి నకిలీ ఆఫర్లను, ఏజెంట్లను నమ్మి ప్రజలు మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *